అడుగే సాగదు పయనం ఆగదు
గమ్యం తెలియని నా దేశంరా,
అడిగేదెవ్వడు ఆపేదెవ్వడు
సహనం మరిచిన నా దేశంరా,
తెల్ల దొరల మెడలు వంచి
అర్ధరాత్రి కట్లు తెంచి,
రెక్క విప్పి పావురంలా
స్వేచ్ఛగా నింగికి ఎగిరెనురా,
మతం కత్తి మొనలు దూస్తే
కులం నెత్తురంత పూస్తే,
మానవతను మంటలేస్తే
నా దేశం కుమిలెనురా,
ఇది నా దేశంరా జగమంతా తల్లిరా
తన పిల్లలు ఎదలో గుచ్చెను ముళ్ళులురా,
ఇది నా దేశంరా ఒక తులసి వనంరా
ఇది నేలన పెరిగెను పిచ్చిగ మొక్కలురా,
ఓ ఓ, కళ్ళముందు ఒళ్ళు కాలుతూ,
నిప్పుల కొలిమే నడి వీధి
ఆర్పకుండా ఆట చూస్తావేం కళ్ళారా,
రాతిగుళ్ళో నూనె నింపుతూ,
వెలుగుతుంటే నిత్య దీపమే
ఆరకుండా చూస్తే పుణ్యమా సోదరా,
ఆఆ, ఒక పూట తిండి లేక
ఈ డొక్కలెండుతున్నా,
అభిషేకం చేస్తారే
ప్రతి పాము పుట్ట వెతికి,
తన కడుపు నిండి ఉన్నా,
ఇక చోటు లేదు అన్నా
పక్కోడి ముద్దనే లాగేస్తారు ఉరికి,
చల్ పదరా చల్ పదరా,
నీ చేబుల ఉన్న బోసి తాతనే
సీసాకై తీసి ఊగెయ్ రా,
నీ దేశం నీ మోసం
అడుగడుగున రంగులు మార్చెయ్ రా,
ఏదైనా ఈ దేశం
తన వడినే నీకై పంచునురా,
ఇది నా దేశంరా ఒక సిరుల పంటరా
అనునిత్యం దోబిడి గురుతులనే కనరా,
ఇది నా దేశంరా ఒక శాంతి దూతరా
ప్రతి నిమిషం దాడుల ఏడుపులే వినరా,
ఈ మట్టి నీకు పుట్టుకిచ్చేరా,
రక్తపు మడుగుల మునిగేరా
పాలు తాగి విషము చిమ్ముతూ బ్రతుకకురా,
నా అన్నదమ్ములంటూ నమ్మితే
తన్నులాటకొస్తవెందుకు,
అమ్మ ప్రేమ అమ్మకానికి కాదురా
నీకు ప్రార్థనంటే తెలుసా
మత గ్రంథమంటే హింసా,
మన కోసం తమ ప్రాణం
అర్పించినోళ్ళు అలుసా,
నా జెండా నేను మోశా
నా గుండెలోన దాచా
నా కలల భారతం రేపటికై చూశా,
జై అనరా జై అనరా,
నిను చల్లగ చూసిన ఇల్లే కదరా
ముసుగే విసిరేసి మనసారా,
నిలదీస్తాం తరిమేస్తాం
మా ఊపిరి చప్పుడు ఉప్పెనరా,
ఈ దేశం మా సొంతం
మేమొక్కటయ్యే క్షణమొవచ్చెనురా,
ఇది నా దేశంరా జనగణ గీతంరా
జయహో జనని మేర చాంద్ సె హై ప్యారా,
ఇది నా దేశంరా ఎహ్ షాన్ హే మేరా
వందేమాతరమే భవితకు మంత్రంరా.